Heart Attack: తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో ఆరో తరగతి బాలిక మృతి
తెలంగాణలో గుండెపోటు (Heart Attack) కలకలం రేపుతోంది. అక్కడికక్కడే కుప్పకూలిన ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో గుండెపోటుతో చనిపోయారు.
- Author : Gopichand
Date : 01-04-2023 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో గుండెపోటు (Heart Attack) కలకలం రేపుతోంది. అక్కడికక్కడే కుప్పకూలిన ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో గుండెపోటుతో చనిపోయారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. ఆరో తరగతి విద్యార్థిని స్రవంతి గుండెపోటుతో మృతి చెందింది. మరిపెడ మండలం బోయపాలెంలో విషాదం చోటుచేసుకుంది.
మార్చి 30న శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా తోటి పిల్లలతో కలిసి రోజంతా ఆడుతూ పాడుతూ గడిపిన చిన్నారి రాత్రి పడుకునేటప్పుడు గుండెపోటుతో మృతి చెందింది. బోడతండాకు చెందిన బోడ లక్పతి, వసంతలకు ఇద్దరు పిల్లలు. రెండో కుమార్తె స్రవంతి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాస పడుతూనే నిద్రలేచింది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో నాయనమ్మను లేపింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి వద్ద నిద్రించగా.. విషయం తెలిసి అందుబాటులో ఉన్న బాబాయ్ వచ్చి సీపీఆర్ చేసి స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.
Also Read: US-Canada Border: సరిహద్దును అక్రమంగా దాటుతూ 8 మంది వలసదారులు మృతి
CPR చేసి వెంటనే RMP వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మార్చి 31న కోడ అంబర్ పేటలో పార్క్ చేసిన కారులో ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.