BRS MLCs Join Congress: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
తాజాగా బీఆర్ఎస్‌కు మరో కోలుకోలేని షాక్ తగిలింది. అదేంటంటే పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLCs Join Congress) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
- Author : Gopichand
Date : 05-07-2024 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీఆర్ఎస్‌కు మరో కోలుకోలేని షాక్ తగిలింది. అదేంటంటే పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLCs Join Congress) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Also Read: Keshava Rao : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేశవరావు..?
కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలలో దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు. వీరంతా గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు.
గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో 40 మంది సభ్యులున్న శాసనమండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరగా.. రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎగువ సభలో ఎంఐఎం, బీజేపీలకు ఒక్కో ఎమ్మెల్సీ, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. మిగిలిన 20 మంది ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్ వద్ద ఉన్నారు. ROR చట్టం, రైతు బంధు స్థానంలో రైతు భరోసాతో సహా కొత్త చట్టాన్ని ఆమోదించడానికి కాంగ్రెస్‌కు కౌన్సిల్‌లో మెజారిటీ అవసరమైన విషయం తెలిసిందే.
అర్థరాత్రి చేరికలు
సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ పర్యవేక్షణలో ఆరుగురు ఎమ్మెల్సీలు అర్థరాత్రి ఒంటి గంట సమయంలో కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. పార్టీలోకి అధికారికంగా చేరిన సందర్భంగా నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. అయితే ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరటం అనేది బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
We’re now on WhatsApp : Click to Join