Sithakka Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సీతక్క
- Author : Sudheer
Date : 07-12-2023 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
నక్సలిజం నుంచి ప్రజాజీవితంలోకి వచ్చిన సీతక్క.. ఆ తర్వాత రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఈమె..ఇప్పడూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీతక్క చోటు దక్కించుకున్నారు. నేడు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు.
ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణ కు చెందిన రాయకీయ నాయకురాలు. 1971 జూలై 9 , జగ్గన్నపేట్ గ్రామం, ములుగు మండలం లో జన్మించారు. ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు.
We’re now on WhatsApp. Click to Join.
2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది.టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ పై 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితురాలైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించారు.
Read Also : Konda Surekha Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ