HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Should Real Estate Traders Also Be Given Rythu Bandhu Cm Revanth Reddy

Rythu Bandhu : రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా.  బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు.

  • Author : Latha Suma Date : 21-12-2024 - 2:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reaction
CM Revanth Reaction

Rythu Bandhu : ఏడో రోజు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే అసెంబ్లీలో రైతు భరోసా విధి, విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అబద్దాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు.. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యల పై అబద్ధాలు చెబుతున్నారు అని సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలన పై సభ్యులకు సభలో సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని సభకు రాలేదని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు బంధు పై సలహాలు, సూచనలు ఇస్తారనుకున్నా.  బీఆర్ఎస్ నేతలు నకిలీ పట్టాలతో రైతు బంధు తీసుకున్నారు. మీరు అంతా మంచి చేసి ఉంటే ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుంటారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు భరోసా ఇద్దామా..? అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో రాజీవ్ రహదారి వేసిన భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని తెలిపారు. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు. మీరు కాదు మాకు ఆదర్శం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేము ఇక్కడ ఉండేవారం కాదు.. 2023లో ఓడి పోయారు. ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి. ఇకముందు ఊడ్చుకుపోతారు. ప్రతీ పక్ష నేతలు చెప్పకపోయినా.. వారు రాత పూర్వకంగా ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చినా వాటిని పరిగణలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోవడం వల్ల అనర్హులకు ఆయాచిత లబ్ధి జరిగిందని అన్నారు. రూ. 22,606 కోట్లు సాగు చేయని భూములకు రైతుబంధు అందిందని చెప్పారు. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు తీసుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులం అని వేల కోట్లు కొల్లగొట్టారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నాం..అన్నారు. బీఆర్ఎస్ చిత్ర, విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో మీ సూచనలు చెప్పండి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Fact Check : పార్లమెంటులోని అన్ని సీట్లపై అంబేద్కర్ ఫొటోలు.. నిజమేనా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • kcr
  • ktr
  • rythu bandhu
  • telangana
  • Telangana Assemblly

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd