Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. కోతులను చంపి తినేశారు!
తోటి మనుషుల పట్ల, జంతువు పట్ల దయతో ఉండాల్సిన మనుషులే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
- Author : Balu J
Date : 13-12-2023 - 2:39 IST
Published By : Hashtagu Telugu Desk
Nirmal: రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం చనిపోతుంది. తోటి మనుషుల పట్ల, జంతువుa పట్ల దయతో ఉండాల్సిన మనుషులే కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం చింతలబోరి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కోతులను చంపి తిన్న ఘటన కలకలం రేపింది.
సంచార జాతులకు చెందిన గిరిజన ప్రజలు నాలుగు కోతులను పట్టుకుని, వాటిని చంపి, వండుకుని తిన్నారు. కోతులను దేవుడిగా పూజిస్తున్నామని, వాటిని చంపడం సరికాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామ శివారులోని తమ గుడారాల వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది.
Also Read: Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక