Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు.
- By Balu J Published Date - 02:26 PM, Wed - 13 December 23

Minister Komatireddy: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అది తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాన్‌స్టాప్‌గా స్పీచ్‌లు ఇవ్వడంతో గొంతుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో చలి తీవ్రత పెరుగుతోంది.
పరీక్షించిన వైద్యులు ఇన్‌ఫెక్షన్ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన వెంకట్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. అనంతరం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌ను కోరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు.