Sharmila : షర్మిల దీక్షకు భగ్నం. పోలీసుల అదుపులో షర్మిల..!
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల
- Author : Maheswara Rao Nadella
Date : 09-12-2022 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ ఆర్ టిపి (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిల (Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా షర్మిల (Sharmila) మాట్లాడుతూ కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని… ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు. మరోవైపు షర్మిల (Sharmila)పై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు.
Also Read: BRS Formation : జెండా, ఎజెండాలో `తెలంగాణ` ను లేపేసిన కేసీఆర్