Shamirpet MRO Bribe Case : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది ..
- Author : Sudheer
Date : 13-02-2024 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ పక్క ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ..వేలల్లో జీతం తీసుకుంటూనే..కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు దొడ్డిదారిన సంపాదించాలని చూస్తారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవని చెప్పి..లంచాల రూపంలో వసూళ్లు చేస్తూ ఆస్తులు పెంచుకుంటుంటారు. ఇప్పటివరకు వేలాదిమంది ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోగా..తాజాగా మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ కి చిక్కింది. శామీర్ పేట్ తహశీల్దార్ (Shamirpet MRO) తోడేటి సత్యనారాయణ (Satyanarayana) రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికారు.
We’re now on WhatsApp. Click to Join.
గచ్చిబౌలిలో ఉంటున్న రామశేషగిరిరావు అనే వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ, రామశేషగిరిరావు నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ ఎమ్మార్వో వినలేదు..మీము అడిగింది ఇస్తేనే నీ పని అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అంత డబ్బు ఇచ్చుకోలేక సదరు బాధితుడు..ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచనతో పక్కా ప్రణాళికతో పథకం రచించి బాధితుడు తహశీల్దార్ డ్రైవర్ బద్రీకి లంచం ఇస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతణ్ని విచారించగా, తహశీల్దార్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మార్వో అక్రమాస్తులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also : Tillu Square Trailer : టిల్లు స్క్వేర్ ట్రైలర్.. పిచ్చెక్కించేందుకు వచ్చేస్తున్నాడహో..!