Tillu Square Trailer : టిల్లు స్క్వేర్ ట్రైలర్.. పిచ్చెక్కించేందుకు వచ్చేస్తున్నాడహో..!
Tillu Square Trailer సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా వైబ్ ని కొనసాగించేలా డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా
- By Ramesh Published Date - 03:18 PM, Tue - 13 February 24

Tillu Square Trailer సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా వైబ్ ని కొనసాగించేలా డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా వస్తుంది. ఈ సినిమాను మల్లిక్ రాం డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 29న రిలీజ్ ఫిక్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 14న టిల్లు స్క్వేర్ ట్రైలర్ రాబోతుంది. మ్యడ్ నెస్ కి రెడీ అవ్వడంటూ మేకర్స్ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. రీసెంట్ గా సిద్ధు బర్త్ డే రోజు టిల్లు స్క్వేర్ నుంచి ఒక గ్లింప్స్ వదిలారు. ఈ గ్లింప్స్ కూడా అదిరిపోయింది.
బుధవారం టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం యూత్ ఆడియన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. టిల్లు స్క్వేర్ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. మరి టిల్లు స్క్వేర్ ఎలా ఉంటుంది. సినిమా నుంచి వస్తున్న ఈ ట్రైలర్ శాంపిల్ ఎలాంటి అంచనాలను పెంచుతుంది అన్నది చూడాలి.