HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Serious Road Accident In Chevella Balakrishna And Naga Chaitanyas Movies Postponed

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

  • By Vamsi Chowdary Korata Published Date - 01:57 PM, Mon - 3 November 25
  • daily-hunt
Chevella Road Accident Bala
Chevella Road Accident Bala

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ, టాలీవుడ్ లో పలు కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

Team #NC24 stands in solidarity with the families affected by the unfortunate incident in Chevella.

Wishing strength, recovery, and peace to all. 🙏 pic.twitter.com/FWkZd03gFH

— SVCC (@SVCCofficial) November 3, 2025

అక్కినేని నాగచైతన్య హీరోగా ‘NC 24’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ (నవంబర్ 3) మీనాక్షి క్యారక్టర్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అప్డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. దురదృష్టకర సంఘటనలో బాధిత కుటుంబాలకు చిత్ర బృందం సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన విషాద సంఘటన మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ దురదృష్టకర సంఘటన దృష్ట్యా, మీనాక్షి చౌదరి పాత్ర పోస్టర్ విడుదలను NC24 టీం రేపటికి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ విషాదంలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని చిత్ర బృందం ప్రకటనలో పేర్కొంది.

In view of the heartbreaking incident near Chevella, the announcement planned for today at 12:01 PM is being held back.

Team #NBK111 extends its deepest sympathies and prayers to the families affected 🙏🏻

— Vriddhi Cinemas (@vriddhicinemas) November 3, 2025

నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమా ‘NBK 111’ నుంచి కూడా ఈరోజు ఓ అప్డేట్ రావాల్సి ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కథానాయికని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అప్డేట్ వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

చేవెళ్ల సమీపంలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు ఇవ్వాల్సిన అనౌన్స్ మెంట్ వాయిదా వేస్తున్నాం. బాధిత కుటుంబాలకు ‘NBK 111’ చిత్ర బృందం ప్రగాఢ సానుభూతిని, ప్రార్థనలను తెలియజేస్తోంది అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chevella road accident
  • naga chaitanya
  • nandamuri balakrishna
  • NBK 111
  • NC 24
  • tollywood

Related News

Bus Accident Chevella

Bus Accident : ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూరు డిపోకు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో బస్సు

  • Mass Jathara Review

    Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

  • Jahnavi Swaroop

    Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

Latest News

  • Bhagavad Gita Teachings: కోపాన్ని జయించడం ద్వారానే నిజమైన విజయం!

  • SLBC Tunnel Collapse : ‘SLBC టన్నెల్ కూలిపోవడానికి కేసీఆరే కారణం’ – సీఎం రేవంత్ రెడ్డి

  • Jubilee Hills Elections : జూబ్లీహిల్స్ పోరులో తెర పైకి కొత్త సమీకరణాలు

  • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

  • AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Trending News

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

    • Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!

    • Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!

    • Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd