Arikapudi Gandhi : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
- By Pasha Published Date - 12:12 PM, Sat - 13 July 24

Arikapudi Gandhi : కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వచ్చిన అరికపూడి గాంధీకి(Arikapudi Gandhi) సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా హస్తం పార్టీలో చేరారు. చేరిన వారిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారం రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా ఇవాళ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఈనెలాఖరు వరకు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ కూడా హస్తం పార్టీకి జైకొట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు (ఆదివారం) ఆయన కాంగ్రెస్‌లో(Congress) చేరుతారని సమాచారం.
Also Read :Bypoll Results : 13 అసెంబ్లీ బైపోల్స్ ఓట్ల లెక్కింపు.. ‘ఇండియా’ కూటమి ముందంజ
బీఆర్ఎస్ పార్టీ గెలిచిన అసెంబ్లీ సీట్లలో 18 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు అరికపూడి గాంధీ కూడా హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి ఇంకో ఐదుగురు ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కూడా చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వరుస చేరికలతో సంబంధిత నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.