Sensational Decision : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Sensational Decision : రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేసింది
- Author : Sudheer
Date : 07-12-2024 - 8:31 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం (Sensational decision of Telangana government) తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం.. ఈ విలీనానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం, గ్రామాల పరిపాలనలో మార్పు తీసుకువచ్చే దిశగా ముందడుగు వేసింది.
రంగారెడ్డి జిల్లాలో 12 గ్రామాలను నాలుగు మున్సిపాలిటీలలో కలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 28 గ్రామాలను ఏడు మున్సిపాలిటీలలో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలను రెండు మున్సిపాలిటీలకు చెందిన పరిధిలో చేర్చారు. దీనివల్ల ప్రాంతీయ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు.. గ్రామ పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పుతో ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నదేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఔటర్ రింగు రోడ్ పరిధి పూర్తిగా పట్టణ ప్రాంతంగా మారనుందని పేర్కొంది.
గ్రామాల మున్సిపాలిటీలలో విలీనంతో మెరుగైన మౌలిక సదుపాయాలు, శుభ్రత, నిర్వహణ వంటి అంశాలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చిన గ్రామాల ప్రజలకు ప్రభుత్వానికి నేరుగా చేరువ కాగల అవకాశాలు ఏర్పడుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం మీద కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా, దీని వల్ల సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గ్రామాల విలీనంతో సమీప మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే అవకాశం ఉండనుంది.
Read Also : Benefits Of Pistachios: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!