Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది
- Author : Praveen Aluthuru
Date : 15-02-2024 - 4:46 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్‌లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది. పేర్కొన్నారు.మునుపటి సంవత్సరం ఈ ఫీజు 2.3 లక్షలు ఉండేది.
ఏటా హైదరాబాద్ పాఠశాలల్లో 10-12 శాతం ఫీజులు పెంచుతున్నారు.గణనీయమైన వార్షిక రుసుములతో పాటు, పాఠ్యేతర ఫీజులు, లైబ్రరీ ఫీజులు మరియు ల్యాబ్ ఫీజులు వంటి అదనపు ఛార్జీలను విధిస్తాయి. అదనంగా కొన్ని పాఠశాలలు విద్యార్థులను విద్యా సంస్థల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయమని ఆదేశిస్తున్నాయి.
మార్కెట్ రేట్లకు అనుగుణంగా సిబ్బంది జీతాలు పెంచాల్సిన అవసరాన్ని హైలెట్ చేస్తున్నాయి సంబంధిత పాఠశాలలు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యాలు ఫీజుల పెంపును సమర్థించుకుంటున్నాయి. పెరుగుతున్న పోటీ మధ్య సిబ్బందిని కాపాడుకోవాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. కాగా హైదరాబాదులోని పాఠశాలలు ఇలా లక్షలకు లక్షలు పెంచుకుంటూ వెళ్తుంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Mangalagiri Kandru Kamala : మంగళగిరి వైసీపీ అభ్యర్ధిగా కాండ్రు కమల..?