HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Saraswati Pushkaras From 15th To 26th May

Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు

  • Author : Gopi Date : 11-01-2025 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saraswati Pushkaras
Saraswati Pushkaras

Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వ‌హించారు. ఈ పుష్క‌రాల‌ను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలన్నిటిని అత్యాధునిక వసతులతో కళాత్మకంగా రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలు దేశంలో మరెక్కడా జరగవని, కాళేశ్వరం సంగమ స్థలంలో మాత్రమే వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నారన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, స్నాన ఘట్టాల ఆధునీకరణ, శానిటేషన్ పనుల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల కూడలిలో గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి స్రవంతి కలిసే చోటు అత్యంత పవిత్రమైన సంగమమ‌ని అన్నారు. స్నాన ఘట్టాలను ఆధునికంగా నిర్విహించాల‌న్నారు. రోడ్లను పునర్మించి, విస్తరించడం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన పనులను వేగం పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Also Read: Singapore Passport : సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఎలా అయింది ?

పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. హెలికాప్టర్ జాయ్ రైడ్ల కోసం హెలిపాడ్లకు మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. ఆలయ పర్యాటక ప్రదేశంగా కాళేశ్వరానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా ఎక్కడ రాజీ పడకుండా మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అన్ని శాఖలను సమన్మయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఆర్టీసి బస్ స్టేషన్ ఉన్న ప్రదేశంలో అత్యాధునిక, ఆకర్షణీయమైన నూతన బస్ స్టేషన్ ను నిర్మించాల‌ని, అత్యాధునిక వీధి దీపాలు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. వీటి కోసం రూ.62 లక్షల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు.

ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు నిర్వహించనున్న కుంబాభిషేకం పనులను కూడా ఎక్కడా లోపం లేకుండా చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ కమిషనర్ ఈ.శ్రీధర్, జాయింట్ కమిషన్ రామకృష్ణారావు, ఎస్ఈ దుర్గాప్రసాద్, టూరిజం ఎండీ ప్రకాశ్, ట్రాన్స్ కో ఎస్ఈ మల్సూర్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్‌ ఇఇ నిర్మల, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఇఇ తిరుపతి, డిపిఆర్వో శీలం శ్రీనివాసరావు, కాళేశ్వరం ఇఓ మారుతి, భూపాలపల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, డిఎం ఇందు, తదితరులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Minister Sridhar Babu
  • Saraswati Pushkaras
  • telangana news
  • telugu news

Related News

Massive blast in Hyderabad's Saroornagar.

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్ర

    Latest News

    • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

    • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

    • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

    • Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

    • Weight Loss: బరువు పెరుగుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీటిని ప్రయత్నించండి..!

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd