HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rs Praveen Kumar Challenges Bandi Sanjay

Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RS Praveen Kumar Challenges Bandi!
RS Praveen Kumar Challenges Bandi!

బండి భగీరథ్‌ కేసు విషయంలో బండి సంజయ్‌ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు విషయంలో బండి సంజయ్ బాధితులను బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని బండి సంజయ్ హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే తన కొడుకును పోలీసులకు అప్పగించాలని పేర్కొన్నారు.

తెలంగాణలో సంచలనం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బండి భగీరథ్‌పై ఆరోపణలు చేసిన బాధితులను బెదిరించలేదని హనుమాన్ గుడిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నిజంగా బండి సంజయ్ హనుమాన్ భక్తుడు అయితే.. బండి భగీరథ్‌ను కొడుకును పోలీసులకు అప్పగించాలని సూచించారు. బండి సాయి భగీరథ్ రోజూ ఎక్కడ తిరుగుతున్నాడో బండి సంజయ్‌ను అడగాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ దేవుడిని ప్రార్థిస్తామో చెప్పే బండి సంజయ్.. తన కుమారుడు సాయి భగీరథ్ సోమవారం నుంచి ఆదివారం వరకు ఎవరిని కొడతాడో, ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడతాడో, ఏ పబ్లో ఉంటాడో, ఏ హుక్కా సెంటర్లో గడుపుతాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్ నిజంగా హనుమాన్ భక్తుడేనా అని ప్రశ్నించారు. అయితే బండి సంజయ్ కానీ, అతని కుమారుడు బండి సాయి భగీరథ్ కానీ ఏనాడైనా హనుమాన్ మాల ధరించారా, హనుమాన్ చాలీసా ఎప్పుడైనా చదివారా అని నిలదీశారు. ఈ క్రమంలోనే ఒక వీడియో రిలీజ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. సుదీర్ఘ ట్వీట్ చేశారు.

మనమంతా కాలినడకన, భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ కొడుకు మాత్రం ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీతమ్మ కోసం ఆంజనేయస్వామి లంకను తగలబెట్టి, సొంత తల్లి కాకపోయినా సీతమ్మనే తల్లిగా భావించి జీవితాంతం దేవతగా ప్రార్థించారని గుర్తు చేశారు. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా గడిపి, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడని ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. కానీ సాయి భగీరథ్ మాత్రం మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడని నిలదీశారు.

తడిబట్టలతో వచ్చి హనుమాన్ ఆలయంలో.. బాధిత అమ్మాయి తల్లిని బెదిరించిందో లేదో చెప్పమని అడగాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడైతే.. ఆయన కుమారుడిని తక్షణమే పోలీసులకు అప్పగించాలని నిలదీయాలని పేర్కొన్నారు. హిందువుగా గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం.. తప్పు చేసిన హిందువును ప్రశ్నిద్దాం అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Bhageerath
  • Bandi Bhagirath
  • Bandi Sanjay
  • bjp party
  • BRS leader
  • POCSO Case
  • rs praveen kumar
  • telangana politics

Related News

Cm Revanth

POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

  • Mamata Banerjee declares I am absolutely not backing down

    Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ

  • CM Chandrababu

    బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

  • Ktr

    KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Latest News

  • MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

  • కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

  • Nerve Health: నరాల బలహీనత వేధిస్తోందా?

  • Bandi Sanjay: బండికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd