Telangana Elections: గద్వాల్ హైవేపై రూ.750 కోట్ల నగదు.. చివరికి ఆ డబ్బు..
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. నగదుతో పాటు భారీగా ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 50 వేల
- By Praveen Aluthuru Published Date - 04:40 PM, Thu - 19 October 23

Telangana Elections: తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. నగదుతో పాటు భారీగా ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 50 వేల కంటే ఎక్కువ ఒక్క రూపాయి ఉన్నా సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. పత్రాలు లేకుండా డబ్బు బయటపడితే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ లారీలో నోట్ల గుట్టలను పోలీసులు గుర్తించారు.
గద్వాల్ జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సాధారణ ట్రక్కులో రూ.750 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అటుగా వెళుతున్న ట్రక్కును అడ్డగించారు. అంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే చివరికి తేలింది ఏంటంటే.. పట్టుబడిన నగదు బ్యాంకుకు సంబందించినది. ట్రక్కులో ఉన్న పెద్దమొత్తంలో ఉన్న నగదు గురించి ఆరా తీసిన పోలీసులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నగదు అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేరళ నుండి హైదరాబాద్‌కు తరలించబడుతున్నట్లు తెలుసుకున్నారు. నోట్ల కట్టల్లో అన్ని రూ.500 నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Thalapathi Vijay Leo Review & Rating రివ్యూ : లియో