Road Accidents: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే యువకుడిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది టాటా ఏస్ వాహనం.
- By Gopichand Published Date - 10:15 AM, Sun - 12 February 23

కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ నేపథ్యంలోనే యువకుడిని 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది టాటా ఏస్ వాహనం. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు శ్రీకాంత్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్‌గా అతను పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Turkey Earthquake: 28 వేలు దాటిన మృతుల సంఖ్య.. ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ సహాయం
మరోవైపు సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతేగ్రామంలో శనివారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన తలారి బుచ్చయ్య (59) అనే వ్యక్తి సైకిల్ పై వెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బైక్ బుచ్చయ్యను ఢీకొట్టాడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బైక్ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.