Hyderabad : తల్లి ప్రాణం విలవిల.. స్కూల్‌కి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
Hyderabad : స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు
- Author : Sudheer
Date : 27-06-2025 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ నగరానికి సమీపంలో దుండిగల్ (Dundigal)మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద తల్లి స్కూటీపై స్కూల్‌కి తీసుకెళ్తున్న చిన్నారిని టిప్పర్ వాహనం (Tipper Accident) ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ ముందు భాగంలో కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో, అతని తల మీదుగా టిప్పర్ టైర్లు వెళ్లాయి. దీంతో బాలుడి తల తీవ్రంగా దెబ్బతిని, స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
ఈ ఘటనను చూసిన స్థానికులు హృదయ విదారక దృశ్యాలను తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. తల్లి కళ్ల ముందే తన బిడ్డ మృతి చెందడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. బోరున విలపిస్తున్న తల్లి ని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం, స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి రోడ్డు భద్రతపై ప్రభుత్వ యంత్రాంగానికి మేలుకొలుపు కావాలి అన్న చర్చ నడుస్తుంది.