HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Should Be Given A Nobel Prize For Lying In Politics Harish Rao

రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ కు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలి – హరీష్ రావు

తెలంగాణ లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ , అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినప్పటికీ, ప్రజలు బిఆర్ఎస్ కు ఘన విజయం అందించారని తెలిపారు.

  • Author : Sudheer Date : 20-12-2025 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

సంగారెడ్డి వేదికగా జరిగిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడినా, బీఆర్ఎస్ అద్భుత ప్రదర్శన చేసిందని ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 శాతం (4 వేలకు పైగా) సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ తన సత్తా చాటిందని, ఇది పార్టీ కేడర్‌లో ఉన్న పట్టుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ 90 శాతం స్థానాలు గెలుచుకోవడం సహజమని, కానీ ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను నమ్మకుండా ప్రతిపక్షానికి పెద్దపీట వేశారని ఆయన విశ్లేషించారు.

 

Harishrao Cng

Harishrao Cng

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ, రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో ఆయనకు ‘నోబెల్ ప్రైజ్’ ఇవ్వాలని హరీష్ రావు ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ‘యాప్‌లు’, ‘మ్యాప్‌ల’ పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఎరువుల లారీలు నేరుగా గ్రామాలకు వచ్చేవి అని, కానీ ఇప్పుడు రైతులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలను ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి, తన మనుమడి సరదా కోసం సింగరేణి నిధులతో 100 కోట్లు ఖర్చు చేసి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ‘రేసింగ్ సీఎం’ కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు తిరిగే ‘ఫ్లయింగ్ సీఎం’ అని విమర్శించారు.

సర్పంచ్‌ల ప్రాముఖ్యతను వివరిస్తూ ముఖ్యమంత్రికి లేని ‘చెక్ పవర్’ కేవలం గ్రామ సర్పంచ్‌కే ఉంటుందని, ఇది రాజ్యాంగం కల్పించిన గొప్ప అధికారమని హరీష్ రావు గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వస్తాయని, వీటిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ధైర్యం చెప్పారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు తలలో నాలుకలా ఉండి సేవ చేయాలని హితవు పలికారు. ప్రస్తుత సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలంలో మరో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, మిగిలిన మూడేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనులు పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • CM Revanth Reddy
  • congress
  • grama panchayat election result
  • harish rao

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Pm

    KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Cm Revanth Mptc Zptc

    Delimitation Bill : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటూ సీఎం రేవంత్ హర్షం

Latest News

  • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

  • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

  • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

  • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

  • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

Trending News

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd