HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Sarkars Sweet Talk For The Poor

Congress Govt : పేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు

Congress Govt : ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది

  • By Sudheer Published Date - 03:29 PM, Thu - 2 January 25
  • daily-hunt
Uttam Mbn
Uttam Mbn

తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ (Congress Govt) తీపి కబురు అందించింది. రేషన్ కార్డు లబ్ధిదారులకు (Ration Card Beneficiaries) సన్నబియ్యం పంపిణీ(Distribution of Superfine Rice) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది. కానీ తర్వలో పేద ప్రజలకు కూడా పూర్తిగా సన్నబియ్యం మంజూరు చేయాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ పంపిణీ రేషన్ డీలర్ల ద్వారా జరగనుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల నుంచి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, గోదాముల్లో నిల్వ ఉంచి మిల్లింగ్ చేయించనున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఈ సంవత్సరం 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సన్న బియ్యాన్ని పేదలకు నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పంపిణీ చేస్తుంది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు.

అంతే కాదు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగబోతుందన్నారు. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ మొదలు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. దాదాపు 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాలు తెలంగాణలోని పేదలకు కీలకమైన సహాయాన్ని అందించే విధంగా ఉంటాయని అంచనా వేయవచ్చు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ తదితర చర్యలు పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలుగా చెప్పవచ్చు.

Read Also : Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • Minister Uttam Kumar Reddy
  • revanth reddy
  • sanna biyyam
  • superfine rice

Related News

CM Revanth

TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

TG Govt : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వాలను చిక్కుల్లోకి నెట్టింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

Latest News

  • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

  • IPL 2026 Retention List: డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ మినీ వేలం.. ఈసారి ఒక్క‌రోజు మాత్ర‌మే!

  • Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు 9 ఏళ్లు పూర్తి.. మోదీ ప్ర‌భుత్వం కంటే ముందు కూడా నోట్ల ర‌ద్దు!

  • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

  • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

Trending News

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd