Caste Census : కులగణన సర్వేకు సర్వం సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ ..
Caste Census : సర్వే టైమ్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, సమగ్రంగా సర్వే జరిగేలా ఏర్పాట్లకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు
- By Sudheer Published Date - 02:51 PM, Sat - 2 November 24

రేవంత్ సర్కార్ (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే (Caste census Survey)కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 6 నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరపబోతున్నారు. ఇందులో భాగంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులకు నేతలు అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. ఈరోజు అన్ని జిల్లాలలో డీసీసీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్వే టైమ్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, సమగ్రంగా సర్వే జరిగేలా ఏర్పాట్లకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. సర్వేలో పాల్గొని అధికారులకు సహకరించేందుకు, అధికారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేస్తున్నారు.
రాష్ట్రంలో కులాల వివరాలను సేకరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేకు పునాదులు వేస్తోంది. ఇది రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చేలా చేయడం, ఆయా కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది.
ఈ సర్వే లక్ష్యాలు (Objectives of the survey) :
కులాల సంక్షేమం: కులాల ఆధారంగా అవసరాలను గుర్తించి, నిర్దిష్ట సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు సర్వే చేయడం.
సామాజిక పరిస్థితుల అధ్యయనం: వివిధ కులాల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకుని, వీరికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందించడం.
న్యాయం, సమానత్వం: వెనుకబడిన కులాలకు అనుకూలమైన విధానాలను రూపొందించడం, సామాజిక న్యాయాన్ని సమకూర్చడం.
ప్రభుత్వ నిధుల సమర్థ వినియోగం: కులాల వారీగా అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించడం.
కులగణన సర్వేను గ్రామ స్థాయిలో అధికారులు అమలు చేయనున్నారు. ఆధార్ నంబర్, కుటుంబ వివరాలు, విద్యా స్థాయి, వృత్తి, ఆస్తి వివరాలు వంటి సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సర్వే ద్వారా మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల పరిస్థితులపై కూడా ఒక స్పష్టత రానుంది.
అలాగే సర్వేలో ఏ ఏ ప్రశ్నలు (telangana caste census Survey questions) అడుగుతారంటే..
సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం రెండు పార్టులు అంటే పార్టు-1, పార్టు-2గా ఉండి ఎనిమిది పేజీల్లో సమాచారం స్వీకరిస్తారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ సమాచారం అడగనున్నారు.
అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయి.
Read Also : Manchu Vishnu Kannappa : కన్నప్ప రిలీజ్.. మంచు హీరో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు..?