Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు.
- By Latha Suma Published Date - 07:04 PM, Mon - 17 February 25

Mahesh Goud: తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డినే తెలంగాణకు సీఎం గా ఉంటారని తెలిపారు. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని కూడా చూస్తామన్నాను. అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్టా అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.
Read Also: Ramadan : ముస్లిం ఉద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్
వచ్చే మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కులగణన చేయడంతోనే తమ నిబద్ధతను నిరూపించుకున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిపారు. వచ్చే ఎన్నికలు కూడా బీసీ అజెండాగానే ఉంటాయని తెలిపిన మహేష్ కుమార్ గౌడ్.. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బీసీనే అని.. ఆయనే ప్రధాని మోడీతో మాట్లాడి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చేలా ఒప్పించాలని మహేష్ కుమార్ సూచించారు.
Read Also: Ragging : పాడేరులో ర్యాగింగ్ కలకలం