Medaram: అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్
Medaram: ఆలయ ఆవరణలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన **తులాభారంలో ఆయన పాల్గొన్నారు. తూకంలో 68 కిలోల బరువు వచ్చిన ఆయన, అదే బరువుకు సమానంగా నిలువెత్తు బంగారం (బెల్లం) అమ్మవార్లకు సమర్పించి తన మొక్కు తీర్చుకున్నారు
- Author : Sudheer
Date : 23-09-2025 - 2:21 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మేడారం చేరుకుని సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన **తులాభారంలో ఆయన పాల్గొన్నారు. తూకంలో 68 కిలోల బరువు వచ్చిన ఆయన, అదే బరువుకు సమానంగా నిలువెత్తు బంగారం (బెల్లం) అమ్మవార్లకు సమర్పించి తన మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
Fees of Private Schools : ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ పై లోకేష్ క్లారిటీ
ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు సురేఖ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయ పరిసరాల్లో స్థానిక గిరిజన పూజారులు వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం జాతర ప్రాంతం తెలంగాణ సాంప్రదాయానికి, గిరిజనుల భక్తి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చర్యలు చేపడుతుందని ఆయన హామీ ఇచ్చారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచింది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన దర్శనం, తులాభారం భక్తులకు విశేష ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.