HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Reddy React On The Attack Of Stray Dogs In Hyderabad

Revanth Reacton: కేటీఆర్ ఫెయిల్.. కుక్కల దాడిపై రేవంత్ రియాక్షన్

బీఆర్ఎస్ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు ఆపరేషన్ ఏంటి? అని రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

  • Author : Balu J Date : 22-02-2023 - 3:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్ (Hyderabad) అంబర్ పేట్ లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుక్కలు తమపై దాడి చేస్తున్నాయని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశామని స్థానికులు వాపోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పందించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోలేదని, క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుందనీ, కుక్కలు ఆకలితో ఆ పిల్లవాడిని తినేశాయని మేయర్ అంటున్నారు. కుక్కలకు ఆపరేషన్ చేస్తామని మంత్రి చెబుతున్నారు. జరిగింది ఒకటైతే, ప్రజాప్రతినిధులు చెప్పేది మరొకటి’ అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలన.. కుక్కల పాలన.. మనుషులు చనిపోతే కుక్కలకు ఆపరేషన్ ఏంటి? మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారు. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు వీధికుక్కల బారిన పడి చనిపోతే ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోంది. నడిరోడ్డుపై కుక్కలు తినే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిందన్నారు. ప్రదీప్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు.

హైదరాబాద్ అంబర్ పేటలో ప్రదీప్ (5) అనే బాలుడు కుక్కల దాడి (Street Dogs) లో మృతి చెందిన విషయం ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది. ఇందల్వాయికి చెందిన గంగాధర్ హైదరాబాద్ హెచ్‌వైడీలోని ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం కొడుకును తన పని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలు (Street Dogs) ఒక్కసారిగా బాలుడిపై దాడి (Attack) చేశాయి. చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి కరిచి చంపాయి. అభం శుభం తెలియని చిన్నారి (Child) మృతితో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. హైదరాబాదులోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై కేటీఆర్, హైదరాబాద్ మేయర మాటలకు పరిమితమయ్యారని ప్రతిపక్షాలతో పాటు పౌరులు కూడా మండి పడుతున్నారు.

https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/02/WhatsApp-Video-2023-02-21-at-1.52.31-PM-1.mp4

Also Read: Kangana Ranaut: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కంగనా రనౌత్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Reaction
  • revanth reddy
  • street dogs

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd