TG Congress Govt : స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త
స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం
- Author : Sudheer
Date : 08-07-2024 - 11:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర సర్కార్ (TG Congress Govt) మహిళలకు మరో తీపి కబురు (Good News) అందించింది. స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఎన్నో పథకాలు అందజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వం పథకాలను అమలు చేసే విధంగా ప్రణాలికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు వంటివి ఇచ్చి ప్రజల నమ్మకాన్ని నిలపెట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా స్వయం సహాయక సంఘాలకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపి వారిలో ఆనందం నింపింది. మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణకు బ్యాంకులు, మండల మహిళా సమాఖ్య, స్త్రీనిధి ద్వారా రుణం అందజేయనుందని ప్రకటించింది. జిల్లాల వారిగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని సెలక్ట్ చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Read Also : SJ Suryah – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం ఖచ్చితంగా అవుతారు – డైరెక్టర్ SJ సూర్య