Katrina Kaif : మహాకుంభ మేళాలో కత్రినా కైఫ్.. స్వామీజీల నుంచి ఆశీస్సులు
అక్కడ స్వామి చిదానంద్ సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతిల ఆశీస్సులను కత్రినా(Katrina Kaif) అందుకున్నారు.
- By Pasha Published Date - 04:27 PM, Mon - 24 February 25

Katrina Kaif : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళా ఫిబ్రవరి 26వ తేదీన ముగియనుంది. ఈ తరుణంలో పలువురు ప్రముఖులు ఈరోజు త్రివేణీ సంగమానికి తరలి వచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఉన్నారు. ప్రయాగ్ రాజ్‌లో గంగ , యమున, సరస్వతీ నదులు కలిసే సంగమ స్థానంలో పుణ్య స్నానాలు చేశారు. ఈసందర్భంగా కత్రిన వెంట ఆమె అత్తమ్మ వీణా కౌశల్ కూడా ఉన్నారు. తదుపరిగా వారు నేరుగా పరమార్ధ్ నికేతన్‌కు చేరుకున్నారు. అక్కడ స్వామి చిదానంద్ సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతిల ఆశీస్సులను కత్రినా(Katrina Kaif) అందుకున్నారు. ఇందుకుగానూ వారికి కత్రిన ధన్యవాదాలు తెలిపారు. మహాకుంభ మేళా వేళ తాను ప్రయాగ్ రాజ్‌లో ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందానని ఆమె చెప్పారు. తప్పకుండా మరోసారి కూడా ఇక్కడ పర్యటిస్తానని ఆమె పేర్కొన్నారు. భక్తిభావంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. తన అత్తమ్మ వీణా కౌశల్‌తో కలిసి మహాకుంభ మేళాకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని కత్రిన చెప్పుకొచ్చారు.
Also Read :Rs 2500 For Women: మహిళలకు ప్రతినెలా రూ.2,500.. ‘మహాలక్ష్మి’ స్కీం కొత్త అప్‌డేట్
భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్..
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ తాజాగా ఛావా(Chhaava) అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇంతకుముందే ఆయన ప్రయాగ్ రాజ్‌లో పర్యటించారు. ఇప్పటిదాకా మహాకుంభ మేళాలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీల జాబితాలో అక్షయ్ కుమార్, క్రిస్ మార్టిన్, ఈశా గుప్తా, విజయ్ దేవరకొండ, హేమ మాలిని తదితరులు ఉన్నారు. భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కూడా ఇవాళ కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఆయన పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పటి వరకు మహాకుంభ మేళాలో 62 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.
#WATCH | Chief Election Commissioner Gyanesh Kumar, along with his family members, takes a holy dip at Triveni Sangam in Uttar Pradesh’s Prayagraj
#Mahakumbh pic.twitter.com/PcwiQgtfzK
— ANI (@ANI) February 24, 2025