Revanth Reddy: రేవంత్ రెడ్డి పై టమాటా, గుడ్లతో దాడి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఉద్రిక్తతగా మారిన భూపాలపల్లి?
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి భూపాలపల్లి లో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో.
- Author : Anshu
Date : 28-02-2023 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth Reddy: తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి భూపాలపల్లి లో హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో.. బీఆర్ఎస్ కార్యకర్తలు.. కోడిగుడ్లతో, టమాటలతో ఆయనపై దాడి చేశారు. అయితే ఆయనకు అవేవీ తగలకపోగా.. అక్కడి కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ప్రజలకు తగిలాయి.
దీంతో అక్కడున్న పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాళ్ళు తిరిగి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ సమయంలో కాటారం ఎస్సై శ్రీనివాస తలకు దెబ్బ తగలడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక రేవంత్ రెడ్డి సభలోకి దూసుకెళ్ళేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో వెంటనే పోలీసులు వారిని అడ్డగించి సమీపంలో ఉన్న సినిమా థియేటర్లో బంధించారు.
ఇక ఈ ఘటన గురించి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తల పై సీరియస్ అయ్యాడు. కోడిగుడ్లు, టమాటలు విసరడం కాదు.. దమ్ముంటే సభ వద్దకు రావాలి అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి సవాల్ విసిరాడు. అంతేకాకుండా నీ ఇల్లు ఉండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక జిల్లా ఎస్పీ పై కూడా ఫైర్ అయ్యాడు.
గండ్ర నీకు చుట్టం కావచ్చు.. నీ గుడ్డలు ఊడే సమయం ఆసన్నమైనది అంటూ మండిపడ్డాడు. ఇక ఎస్పీని అధికారం శాశ్వతం అనుకుంటున్నావా అంటూ కోపంతో ప్రశ్నించాడు. సభపై ఆవరగాలు దాడులు చేస్తుంటే.. చూస్తూ ఊరికే ఉంటారా అంటూ మండిపడ్డాడు. ఇక బీఆర్ఎస్ సభ ఉందని తాము ఒకరోజు వాయిదా వేసుకున్నామని.. కానీ దాడులు జరుగుతుంటే మీరు పట్టించుకోవటం లేదంటూ అక్కడి ఎస్పీ, పోలీసులపై ఫైర్ అయ్యాడు రేవంత్ రెడ్డి.