Farmer loan waiver : రైతు రుణమాఫీ..రెండో విడత నిధుల విడుదల
రెండో విడతల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాకు రూ.984.34 కోట్లు విడుదల
- By Latha Suma Published Date - 01:43 PM, Tue - 30 July 24

Farmer loan waiver: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లోనే రెండో విడత రైతు రుణమాఫీ(second installment farmer loan waiver) నిధుల విడుదల చేశారు. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు 7 లక్షల మంది రైతులకు 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపులు చేశారు. 15 రెండో విడుతలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 17 మంది రైతులకు చెక్కులను అందజేశారు. రైతు రుణమాఫీ మొదటి విడతలో 11,34,412 రైతులకు రుణమాఫీ అయింది. దీని కోసం 6034.96 కోట్లు ఖర్చు చేసింది సర్కార్. రెండవ విడతలో 6,40,223 మంది రైతులకు రుణమాఫీ అయింది. దీని కోసం 6190.01 కోట్లు ఖర్చు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడుత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ. 6,190 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారని తెలిపారు. సాధ్యం కాదనుకున్నవాళ్లకి మేం రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. 1580 కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వమే కడుతుందన్నారు. క్రాఫ్ ఇన్స్యూరెన్స్ 1350 కోట్లు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర రైతులకు ఇవాళ పండగ రోజని తెలిపారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల చేసిందని గుర్తు చేశారు. చివరి విడత సగం వదిలేసిందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న వాళ్ళకి రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు.