Ganja Batch Attack : ఏపీలో గంజాయి బ్యాచ్ కి వణికిపోతున్న పోలీసులు
గంజాయి మత్తులో యువత పోలీసులపై , రాజకీయ నేతలపై దాడులకు తెగబడుతున్నారు
- Author : Sudheer
Date : 30-07-2024 - 1:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో గంజాయి బ్యాచ్ (Ganja Batch Attack) కి పోలీసులు (Police) వణికిపోతున్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో గంజాయి అమ్మకాలు , విక్రయించడం బాగా పెరిగింది. చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. ఆ మత్తులో ఏంచేస్తున్నామో..ఎవర్ని కొడుతున్నామో..ఎవరి ఫై దాడి చేస్తున్నామో..అసలు ఒంటి సోయి అనేది కూడా తెలియడం లేదు. రోజు రోజుకు గంజాయి బ్యాచ్ ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
దీంతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ. గంజాయి అమ్మకాలపై , గంజాయి తీసుకుంటున్న వారిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటుంది. అయితే గంజాయి మత్తులో యువత పోలీసులపై , రాజకీయ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. రీసెంట్ గా ఓ మంత్రి కాన్వాయ్ కి అడ్డు తగిలి నానా బీబత్సం సృష్టించిన ఘటన సంచలనం రేపగా..తాజాగా వైజాగ్ లో ఓ యువకుడు గంజాయి సేవించి పోలీస్ ఫై దాడి చేసాడు. యువకుడి నుండి తప్పించుకునేందుకు సదరు కానిస్టేబుల్ ట్రై చేసినప్పటికీ దాడి చేసాడు. రోడ్లపై యథేచ్ఛగా గంజాయి సేవిస్తుండగా..పోలీసులు పట్టుకున్నారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు ..పోలీస్ ఫై అసభ్యకరంగా బూతులు తిడుతూ..దాడి చేసాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ చేయి విరుగగా..మరో కానిస్టేబుల్ ముఖానికి గాయం అయ్యింది. ఇలా ఈ ఒక్క చోటే కాదు చాల చోట్ల పోలీసులపై దాడులకు తెగపడుతున్నారు.
నిన్న రాత్రి కూడా పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు కాన్వాయ్ ఫై గంజాయి బ్యాచ్ దాడి చేసారు. ఈ దాడిలో అదృష్టవశాత్తు ఆయనలేరు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వసం అయ్యాయి. ఇలా ఎవరిపై పడితే వారిపై దాడి చేస్తుండడం తో పోలీసులు టెన్షన్ పడుతున్నారు.
గంజాయి మత్తులో పోలీసులపై దాడి చేసిన యువకులు విశాఖపట్నంలో గంజాయి మత్తులో పోలీసులను బూతులు తిడుతూ దాడి చేసిన యువకులు.. కానిస్టేబుల్‌కు గాయాలు. #Visakhapatnam #AndhraPradesh #HashtagU pic.twitter.com/2269RAmFXK
— Hashtag U (@HashtaguIn) July 30, 2024
Read Also : Realme: రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే?