Viral News : రంగారెడ్డి కోర్టులో కలకలం.. జీవితఖైదు విధించిన జడ్జిపై నిందితుడి చెప్పు దాడి
Viral News : రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష విధించిన న్యాయమూర్తిపై ఆగ్రహంతో నిందితుడు చెప్పు విసిరాడు. ఈ ఘటనతో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది.
- By Kavya Krishna Published Date - 07:58 PM, Thu - 13 February 25

Viral News : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో నిందితుడిగా నిర్ధారితమైన వ్యక్తికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుతో ఆగ్రహానికి గురైన నిందితుడు కోర్టులో హల్‌చల్ చేశాడు. తాను నిర్దోషినని చెప్పేందుకు జడ్జితో మాట్లాడాలని కోరుతూ నేరుగా న్యాయమూర్తి వద్దకు పరిగెత్తి వెళ్లాడు. ఆ క్రమంలో అనూహ్యంగా తన కాలి చెప్పు తీసి జడ్జిపై విసిరాడు.
రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోక్సో కేసు విచారణ సాగింది. నేరం రుజువైన నేపథ్యంలో న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు విన్న నిందితుడు తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. తన మనోభావాలను నేరుగా జడ్జికి చెప్పాలని ఉద్దేశించి కోర్టులో న్యాయమూర్తి దిశగా పరుగెత్తి వెళ్లాడు. అనూహ్యంగా తన కాలి చెప్పు తీసి జడ్జిపై విసిరి, కోర్టులో కలకలం రేపాడు.
Komatireddy Venkat Reddy: రీజినల్ రింగ్ రోడ్డు పనులు వేగవంతం
నిందితుడి అనూహ్య ప్రవర్తనతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనను చూసిన న్యాయవాదులు వెంటనే స్పందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో భయం, గందరగోళం నెలకొంది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనతో న్యాయవ్యవస్థపై దాడులను ఖండిస్తూ న్యాయవాదులు, పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు వంటి గంభీరమైన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి కోర్టులో చోటు చేసుకున్న ఈ దారుణ సంఘటన న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే ఘటనగా చర్చనీయాంశమవుతోంది.
Valentines Day History : పిల్లలు పుట్టని భార్యలను తోలు ఊడేలా కొట్టే అమానుష పండుగ