Rajasingh : సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Rajasingh : బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, కొంతమంది నాయకులు బయటకు వెళ్లిపోవాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
- By Sudheer Published Date - 04:45 PM, Fri - 14 March 25

తెలంగాణ(Telangana)లో రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) తన సంచలన వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. ఆయన ఈసారి తమ పార్టీనే లక్ష్యంగా చేసుకుని పలు విమర్శలు చేశారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, కొంతమంది నాయకులు బయటకు వెళ్లిపోవాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ లోపలే కొన్ని వర్గాలకు చెందిన నాయకులు బీజేపీని స్వంత పార్టీగా భావిస్తున్నారని, వారిని తొలగిస్తేనే మంచి రోజులు వస్తాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కొంత మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వీరి వివరాలు బీజేపీ జాతీయ నాయకత్వానికి అందజేయనున్నట్లు వెల్లడించారు.
Harry Brook: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌కు షాక్.. రెండేళ్ల నిషేధం!
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనా రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హోలీ పండుగ సందర్భంగా విధించిన ఆంక్షలను ఆయన తీవ్రంగా ఖండించారు. హిందువుల పండుగల గురించి నియంత్రణలు విధించే అధికారం సీఎం రేవంత్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిజాం పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రేవంత్ రెడ్డి తొమ్మిదో నిజాంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. హోలీ పండుగను 12 గంటల వరకు మాత్రమే జరపాలని విధించిన నిబంధనను తప్పుబట్టారు. మరోవైపు ముస్లింలు రంజాన్ సమయంలో చేసే వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నియంత్రించదని ప్రశ్నించారు.
CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేయడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బీజేపీ నాయకత్వం రాజాసింగ్ లేఖపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.