Telangana BJP: త్వరలోనే రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేత?
నిత్యం వివాదాస్పదంలో ఇరుక్కునే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ నుండి సస్పెండ్ అయి సంవత్సరం కావొస్తుంది. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు
- By Praveen Aluthuru Published Date - 05:05 PM, Sun - 2 July 23

Telangana BJP: నిత్యం వివాదాస్పదంలో ఇరుక్కునే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆ పార్టీ నుండి సస్పెండ్ అయి సంవత్సరం కావొస్తుంది. గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఢిల్లీ పెద్దలు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అతనిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. అయితే రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండు మూడు సార్లు ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ కేంద్రం నుంచి సానుకూలత రాలేదు.
తాజగా రాజా సింగ్ సస్పెన్షన్ గురించి బిజెపి నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌కు సంబంధించి బీజేపీ నిర్ణయం ఆలస్యమవుతోందని మా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే బండి సంజయ్ సహా రాష్ట్ర పార్టీ మొత్తం సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతున్నట్టు ఆమె ట్వీట్ చేసింది.
రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీపై నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అయితే విశ్వసనీయ సమాచారం ఏంటంటే రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 8న మోడీ తెలంగాణకు రానున్నారు. వరంగల్ లో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. ఈ సభ అనంతరం రాజాసింగ్ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకోనుంది కేంద్రం.
Read More: Triangle Fight In Telangana: బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర: బండి సంజయ్