Rain Alert Today : తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఎఫెక్టుతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 08:23 AM, Wed - 6 December 23

Rain Alert Today : మిచౌంగ్ తుఫాను ఎఫెక్టుతో ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగామ, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈమేరకు పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్‌లను జారీచేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
మంగళవారం రోజు కురిసిన వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా కోతకు వచ్చిన పైరుతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో వరదనీరు చేరి ధాన్యం కొట్టుకుపోయింది. వేల క్వింటాాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా.. టార్పాలిన్లు సరిపోక అక్కడి ధాన్యం తడిసిపోయింది. గోదాములకు తరలించకుండా మార్కెట్లలో ఆరుబయట ఉంచిన ధాన్యం సైతం తడిచింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తిని పంట తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోనే నిల్వ ఉంచిన ఏరిన పత్తి తడిసిపోయింది. మరి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్న మిర్చి రాలిపోయింది.
Also Read: Rain Alert Today : ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ వర్షాలు
భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలని రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. విద్యుత్, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి ఆ ప్రకటనలో(Rain Alert Today) సూచనలు చేశారు.