Rahul Bus Yatra : రాహుల్ పర్యటన తో కాంగ్రెస్ లో మరింత ఊపు ..
వీరి పర్యటన తో కాంగ్రెస్ పార్టీ ల కొత్త జోష్ రావడం తో పాటు ప్రజల్లో కాంగ్రెస్ ఫై మరింత నమ్మకం పెరగడం ఖాయమని నేతలు భావిస్తున్నారు
- Author : Sudheer
Date : 16-10-2023 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో ఈసారి కాంగ్రెస్ (Congress) అధికారం రావడం పక్క అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రెండుసార్లు బిఆర్ఎస్ (BRS) అధికారం చూసిన రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాదిస్తుందని , నిరుద్యోగులకు , రైతులకు మేలు జరుగుతుందని అంత అనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు ( Six Guarantees) ప్రజల్లో ఆశలు రేపాయని, ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ కు ఇద్దామనుకుంటున్నారని వారంతా అంటున్నారు.
ఇప్పటికే ఇతర పార్టీల నేతలు చేరిక , ఆరు గ్యారెంటీ హామీలతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు రాహుల్ , ప్రియాంక (Rahul & Priyanka) ల పర్యటన మరింత జోష్ నింపడం ఖాయం అంటున్నారు. తుక్కుగూడ సభ తర్వాత మరోసారి రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక గాంధీలు రాబోతున్నారు. వీరి పర్యటన తో కాంగ్రెస్ పార్టీ ల కొత్త జోష్ రావడం తో పాటు ప్రజల్లో కాంగ్రెస్ (Congress) ఫై మరింత నమ్మకం పెరగడం ఖాయమని నేతలు భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పాలనా వైఫల్యాలపై రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో విరుచుకపబోతున్నారని అంటున్నారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో కొత్త అనుభూతిని తీసుకరాబోతున్నారని నేతలు భావిస్తుంటారు. ఈనెల 18న ములుగు జిల్లాలో రాహుల్ , ప్రియాంక లు కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం చేయబోతున్నారు. అనంతరం సభలో పాల్గొని మహిళా డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు. ములుగు, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మూడు రోజుల పాటు రాహుల్, ప్రియాంక పర్యటన కొనసాగనుంది. బస్సు యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో హస్తం నేతలు మమేకం కానున్నారు. నిరుద్యోగ యువత, రైతులు, సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ వర్కర్స్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులతో పాటు..బోధన్‌లో బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతోనూ రాహుల్ సమావేశం కానున్నారు.
Read Also : BRS Activist Died : కేసీఆర్ ప్రచార సభలో అపశృతి..బిఆర్ఎస్ కార్యకర్త మృతి