HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Quality Education For Every Student Cm Revanths Key Comments

CM Revanth: ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య‌.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరిన ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందేలా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు.

  • Author : Gopichand Date : 13-06-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యా ప్ర‌మాణాల పెంపే త‌మ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాల క‌ల్ప‌నకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లున్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు.

పాఠ‌శాల‌లు పునః ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారుల‌తో ముఖ్య‌మంత్రి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేరిన ప్ర‌తి విద్యార్థికి నాణ్య‌మైన విద్య అందేలా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం ఆదేశించారు. ఈ క్ర‌మంలో బోధ‌న ప్ర‌మాణాల పెంపున‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను అధికారుల‌కు సూచించారు. విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతో పాటు నైపుణాల పెంపున‌కు వీలుగా విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని సీఎం సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో వారు త‌మ‌కు ఇష్ట‌మైన రంగంలో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం రేవంత్‌ అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read: DGCA Orders: విమాన ప్ర‌మాదం.. డీజీసీఏ కీల‌క నిర్ణ‌యం, ఇక‌పై ఈ రూల్స్ పాటించాల్సిందే!

తెలంగాణలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యా శాఖ పుర‌పాల‌క శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ఉన్న వివిధ విద్యా సంస్థ‌ల‌ను హేతుబ‌ద్దీక‌రించి ప్ర‌తి పాఠ‌శాల‌లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండేలా చూడాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాణ్య‌మైన భోజ‌నం, యూనిఫాంలు, పాఠ్య పుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని.. డే స్కాల‌ర్స్‌కూ ఆ పాఠ‌శాల‌ల్లోనే అవ‌న్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

పిల్ల‌ల‌కు కుటుంబం, స‌మాజం ప్రాధాన్యాన్ని వివ‌రించ‌డంతో పాటు కుటుంబం, సమాజం ప‌ట్ల వారి బాధ్య‌త‌ను తెలియ‌జేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మాన‌సికంగా దృఢంగా త‌యార‌వ‌డంతో పాటు బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా రాణిస్తార‌ని సీఎం అన్నారు. స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అజిత్ రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి శ్రీ‌దేవ‌సేన‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌ర‌సింహారెడ్డి పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • education
  • Higher Education
  • primary schools
  • Quality Education
  • revanth reddy
  • telangana students

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Aakash Institute Telangana

    JEE Main 2026 : ఆకాష్ ఇన్‌స్టిట్యూట్ తెలంగాణ విద్యార్థుల ప్రభంజనం

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Latest News

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd