HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pushpa 2 Controversy Telangana Government Is The First Defendant Cpi Narayana

Pushpa-2 Controversy: పుష్ప‌-2 వివాదం.. మొద‌టి ముద్దాయి తెలంగాణ ప్రభుత్వ‌మే: సీపీఐ నారాయ‌ణ‌

సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా? పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చొని చూడగలవా? లేస్తే ఒకసారి, కూరుచుంటి వికాసారి అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనం?

  • Author : Gopi Date : 22-12-2024 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pushpa-2 Controversy
Pushpa-2 Controversy

Pushpa-2 Controversy: అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌-2 (Pushpa-2 Controversy) మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక ప్రెస్ నోట్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న ప‌లు విష‌యాల గురించి ప్ర‌స్తావించారు. స్మగ్లర్స్ వ్యవస్థకు.. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ లాంటి క్రూరమైన‌ దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తూ, హింసాయుత నేర ప్రవృత్తిని “తగ్గేది లేదు” అని డైలాగులు కొడుతూ ప్రోత్సహించి, హీరో వర్షిప్ప్‌ను యువకులలో కల్పించేవిధంగా “పుష్ప” సినిమాను తీశారు. ఆ బడుద్ధాయి సినిమాకు రాయతీలు ప్రకటింటి ప్రజలపై భారం మోపడానికి నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అసలు మొదటి ముద్దాయి. ఏదైనా సందేశమాత్మక చిత్రానికి రాయితీలివ్వవచ్చు.. ఎందుకంటే ఈ అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరణ యివ్వరుగనుక అని రాసుకొచ్చారు.

సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా? పుష్ప సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి కూర్చొని చూడగలవా? లేస్తే ఒకసారి, కూరుచుంటి వికాసారి అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనం? ఏ తెలుగు భాషకు, యాసకు ఆదర్శం? ప్రముఖ సినిమా ఆదర్శ నటులు “అల్లు” తరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడమా? మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోడానికి తెగించి ఆమె బలైపోతే, అందులో ఆమె సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చిందే తప్ప హీరోను చూడడానికి రాలేదు. చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడేచ్చేమోగాని రాజకీయనాయకులు అంత కక్కుర్తి పడాలా? అని విమ‌ర్శించారు.

Also Read: Rohit Sharma: టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. రోహిత్ శ‌ర్మ‌కు గాయం!

సభ్యసమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు, సాహితీవేత్తలు, సామజిక స్పృహ వున్నవాళంతా ముక్త కంఠంతో ఖండించాలి. బాధిత కుటుంబానికి పుష్ప యాజమాన్యం యిచ్చే ముదనష్టపు ఆర్థిక సాయాన్ని తిరస్కరించాలి. ప్రభుత్వం, సభ్యసమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలో మావంతు ప్రకటిస్తాను అని ఆయ‌న పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu aravind
  • Congress Govt
  • cpi narayana
  • hyderabad
  • Icon Star Allu Arjun
  • Pushpa 2
  • Pushpa 2 The Rule
  • telangana news
  • telugu news

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd