HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Promotions In Irrigation Department By The End Of January Minister Uttam

Minister Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో 1300 ఉద్యోగాలు!

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే రూ. 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

  • Author : Gopi Date : 08-01-2025 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Uttam
Minister Uttam

Minister Uttam: నీటిపారుదల శాఖలో జనవరి మాసాంతానికి పదోన్నతులతో పాటు బదిలీల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) వెల్లడించారు. నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్ నాథ్‌, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈ. ఎన్.సి జనరల్ అనిల్ కుమార్, ఈ. ఎన్.సి ఓ& ఎం విజయభాస్కర్ రెడ్డిలతో వేసిన ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సుల మేరకే ఈ ప్రక్రియ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇంతకాలంగా న్యాపరమైన అడ్డంకులు ఉన్నందునే జాప్యం జరిగిందని వాటిని అధిగమించేందుకు ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బుధవారం రోజున ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో తెలంగాణ ఏఈఈల‌ అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈఎన్‌సీ అనిల్ కుమార్, హరేరాం, డిప్యూటీ ఈఎన్‌సీ శ్రీనివాస్‌ల‌తో పాటు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ, సంఘం నేతలు బండి శ్రీనివాస్, నాగరాజు, సమర సేన్, సంతోష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దా కాలంగా నీటిపారుదల రంగం గాడి తప్పిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి గాను నీటిపారుదల శాఖా సంవత్సరానికి అప్పులకు, వడ్డీలకే రూ. 11,000 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన ప్రభుత్వం ఎక్కువ ఖర్చుచేసి తక్కువ ప్రయోజనం పొందిందని, ఆ ఫలితం ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారంగా పరిణమించిందన్నారు. అటువంటి నీటిపారుదల శాఖను సంవత్సరకాలంగా గాడిలో పెడుతున్నామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. మానవవనరులు, మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈల‌ను నియమించడంతో పాటు 1800 మంది లష్కర్లను నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

మరో 1300 ఉద్యోగాల‌ నియమాకాలకై పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతిచ్చామన్నారు. యావత్ భారతదేశంలోనే ఇక్కడి నీటిపారుదల శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రాంతంలోను ఇక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు నిర్మించారన్నారు. ఆధునిక దేవాలయాలుగా బాసిల్లిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్ట్ లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదహరించారు. అటువంటి ఇంజినీర్లకు యువ ఇంజినీర్లు వారసత్వంగా ఎదగాలని ఆయన ఉద్బోధించారు. విధినిర్వహణలో సిన్సియారీటీ, నిబద్ధత, పారదర్శకత కనిపించాలని అటువంటప్పుడే ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఆయన చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ నీటిపారుదల శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్నారు. అటువంటి శాఖ ప్రతిష్ఠతను నిలిపేందుకు యువ ఇంజినీర్లు కృషి చేయాలన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AEEs
  • Irrigation Department
  • Minister Uttam Kumar Reddy
  • promotions
  • Promotions In Irrigation Department
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd