Phone-Tapping Case : ప్రణీత్ రావుకు బెయిల్
Phone-Tapping Case : చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్ రావు, కోర్టు తీర్పుతో విడుదల కానున్నాడు
- By Sudheer Published Date - 03:25 PM, Fri - 14 February 25

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone-Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తొలుత అరెస్టైన ప్రణీత్ రావు(Praneeth Rao)కు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రణీత్ రావు, కోర్టు తీర్పుతో విడుదల కానున్నాడు. ప్రణీత్ రావు తరఫున లాయర్ ఉమామహేశ్వరరావు ఫిబ్రవరి 11న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివారెడ్డి విచారణకు హాజరుకాకపోవడంతో వాదనలు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈరోజు విచారణ కొనసాగగా, ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేయాలని తీర్మానించింది.
Delhi BJP New CM: ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది?
ఈ కేసులో ఇప్పటికే ఇతర నిందితులకు బెయిల్ లభించిందని, ప్రస్తుతం ప్రణీత్ రావు మాత్రమే జైలులో ఉన్నారని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ ప్రభాకర్ రావులకు హైకోర్టు జనవరి 31న మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదేవిధంగా మరో నిందితుడు అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ప్రణీత్ రావు తరఫున వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి సెషన్స్ కోర్టు జడ్జి జస్టిస్ రమాకాంత్, ప్రణీత్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. దీంతో ప్రణీత్ రావు విడుదల కానున్నాడని ఆయన లాయర్ తెలిపారు. ఈ తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.