HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Praja Palana Utsavalu

Telangana Praja Palana Utsavalu : నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’

Telangana Praja Palana Utsavalu : 'ప్రజా పాలన ఉత్సవాల' షెడ్యూల్ ప్రకారం.. నేడు మక్తల్‌లో (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

  • Author : Sudheer Date : 01-12-2025 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Praja Palana Utsavalu
Praja Palana Utsavalu

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నేటి (డిసెంబర్ 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రతిరోజూ ఒక ఉమ్మడి జిల్లాలో జరగనున్నాయి. గతంలో పాలనలో జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఒక ‘అద్భుత పాలసీ’ని జాతికి అంకితం చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణను బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో ‘విజన్‌ డాక్యుమెంట్‌’ తయారు చేసినట్లు సీఎం వివరించారు.

Perfume Side Effects: పర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఈ ఎఫెక్ట్స్‌ గురించి తెలుసుకోండి!

ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలను వెల్లడించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రత్యేకంగా ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, ఆ సంపదను పేద ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తెలంగాణకు ‘రెండో మణిహారం’ సిద్ధం చేస్తున్నట్లు, రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు రాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ, భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని వివరించారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే పాలన, పారదర్శకత, మరియు వేగవంతమైన అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

‘ప్రజా పాలన ఉత్సవాల’ షెడ్యూల్ ప్రకారం.. నేడు మక్తల్‌లో (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రతిరోజూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడంతో ఒక ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన అంశాలు డిసెంబర్ 8 & 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్నాయి. 8వ తేదీన గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించగా, 9వ తేదీన “తెలంగాణ విజన్-2047” డాక్యుమెంట్‌ను భారీ ఈవెంట్‌లో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఉత్సవాలకు ముగింపుగా, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Congress Govt
  • Praja Palana
  • Praja Palana Utsavalu
  • telangana
  • Telangana Praja Palana Utsavalu

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Telangana Congress Coordina

    TG Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd