Praja Darbar : ప్రజాదర్బార్ కు పోటెత్తిన ప్రజలు
ప్రగతిభవన్ ను జ్యోతిరావ్‌పూలే ప్రజా భవన్ గా పేరు మార్చిన ఆయన.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ (Praja Darbar) పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా వినడమే కాదు.. పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నారు.
- Author : Sudheer
Date : 08-12-2023 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ (Revanth Reddy)..తన మార్క్ పాలనను మొదలుపెట్టారు. పదేళ్లుగా కేసీఆర్ కు సొంతమైన ప్రగతిభవన్ ను కాస్త ప్రజా దర్బార్ (Praja Darbar) గా మార్చేయడమే కాదు..ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఉన్న ముళ్లకంచెను తొలగించి..ప్రజల దర్బార్ ను చేసారు. శుక్రవారం ఉదయం నుండే పెద్ద ఎత్తున పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వినతి పత్రాలతో ప్రజాదర్బార్ కు చేరుకోవడం మొదలుపెట్టారు. సీఎం రేవంత్ దగ్గర ఉండి, ప్రజల సమస్యలు తీసుకుంటూ వారి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను టార్గెట్ చేసిన రేవంత్ ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ ప్రజల గోడు వినరని.. ప్రజంటే పట్టదని విమర్శలు గుప్పించిన రేవంత్.. తాను ప్రజాపాలన చేసి చూపిస్తానని జనానికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చిన ఆయన.. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ పేరుతో ప్రజా సమస్యలను స్వయంగా వినడమే కాదు.. పరిష్కార దిశగా చర్యలు తీసుకోనున్నారు. ప్రజా దర్బార్ (Praja Darbar) నిర్వహణ సందర్భంగా నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు సీఎం రేవంత్. రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రజల గోడును తెలుసుకుంటున్నారు.
మరికాసేపట్లో సీఎం రేవంత్ సచివాలయంలో విద్యుత్‌పై రివ్యూ చేయనున్నారు. విద్యుత్తు అంశంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌లో మాజీ సీఎం కేసీఆర్ రూ. 85 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని, విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలు సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎండీల రాజీనామాలు ఆమోదించవద్దని, రివ్యూ మీటింగ్‌కు సంబంధిత అధికారులంతా తప్పకుండా రావాలని సీఎం ఆదేశించారు.
Read Also : UPI Limit – 5 Lakhs : ఆస్పత్రులు, విద్యాసంస్థలకు యూపీఐ లిమిట్.. ఇక రూ.5 లక్షలు