HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Power Point Presentation On Caste Enumeration And Classification Tomorrow

Power Point Presentation: రేపు కుల గ‌ణ‌న‌, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

కుల గ‌ణ‌న‌, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినంద‌న‌లు తెలిపారు.

  • Author : Gopi Date : 13-02-2025 - 9:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Power Point Presentation
Power Point Presentation

Power Point Presentation: తెలంగాణ ప్ర‌భుత్వం రేపు (శుక్ర‌వారం) కుల గ‌ణ‌న‌, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) ఇవ్వ‌నుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలకు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌జంటేష‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొననున్న‌ట్లు తెలుస్తోంది. గాంధీ భ‌వ‌న్‌లోని ప్ర‌కాశం హాల్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గ‌ణ‌న‌, ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Also Read: RBI Bars Loans: బ్యాంక్ ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా?

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొని ప్రజెంటేషన్ ఇవ్వ‌నున్నారు.

బీసీ సంఘాల అభినంద‌న‌లు

కుల గ‌ణ‌న‌, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినంద‌న‌లు తెలిపారు. కుల గ‌ణ‌న‌కు మరోసారి అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌కు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రి పొన్నంకు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. బీసీలు చేస్తున్న పోరాటానికి స్పందించి కుల గణ‌న‌ పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించడం, స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ చట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమ‌ని పేర్కొన్నారు. సమగ్ర కులగణనలో నేటి వరకు పాల్గొనని వారిని ప్రత్యేకంగా గుర్తించి ఆన్ లైన్ విధానమే కాకుండా ఆఫ్ లైన్ పద్ధతిలో కూడా సర్వే నిర్వహించాల‌ని వారు ప్రభుత్వానికి సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • caste census
  • Caste census Survey
  • cm revanth
  • congress
  • DCM Bhatti
  • hyderabad
  • power point presentation
  • telangana
  • telugu news

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd