HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం
HILT Policy : కేటీఆర్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. హిల్డ్ పాలసీలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని
- By Sudheer Published Date - 06:15 PM, Fri - 5 December 25
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్డ్ పాలసీ (HILTP – Housing in Industrial Land Transfer Policy) పేరుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. ఈ విధానం ద్వారా సుమారు రూ. 5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాల కోసం కేటాయించిన పారిశ్రామిక భూములను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలు వద్దు అంటూ, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించుకోవడానికి ప్రైవేట్ డెవలపర్‌లకు ధారాదత్తం చేస్తోందని ధ్వజమెత్తారు.
India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
కేటీఆర్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. హిల్డ్ పాలసీలో ఉన్న రెండు ముఖ్యమైన అంశాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవేనని, అంతేకాకుండా ఆ ఫైళ్లపై అప్పటి మంత్రిగా కేటీఆర్ స్వయంగా సంతకాలు చేశారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారా అని పొంగులేటి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే కోకాపేట, నియోపోలిస్ ప్లాట్లను వేలం వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పుడు కేటీఆర్‌కు ఈ పద్ధతులు గుర్తులేవా అని నిలదీశారు. అంతేకాకుండా, గత ప్రభుత్వం ముడుపులు తీసుకొని ప్రభుత్వ భూములను కన్వర్షన్ చేసిందని ఆరోపించారు.
Akhanda 2 Postponed : అఖండ-2 వాయిదా..నిర్మాతల పై బాలయ్య తీవ్ర ఆగ్రహం?
తన ఆరోపణలకు బలం చేకూరుస్తూ పొంగులేటి మంత్రి కేటీఆర్‌ను ఒక నిర్దిష్ట ఉదాహరణతో ప్రశ్నించారు. ఎల్‌బీ నగర్‌లో పీవీ రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇచ్చిన 40 ఎకరాల భూమిని ఏ పాలసీ ఆధారంగా కన్వర్షన్ చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు అగ్ర నాయకులు పరస్పరం భూ కుంభకోణాల ఆరోపణలు చేసుకోవడం, పాత పాలసీల ఫైళ్లపై సంతకాల గురించి ప్రస్తావించడం చూస్తుంటే, ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణగేలా కనిపించడం లేదు. పారిశ్రామిక భూములను నివాస, వాణిజ్య అవసరాల కోసం మార్చడానికి ఉద్దేశించిన ఈ హిల్డ్ పాలసీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరాటం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.