TS : తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Author : Latha Suma
Date : 24-05-2024 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
Polycet Counselling Schedule: తెలంగాణ(Telangana)లో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Polycet Counselling Schedule) విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్‌ని కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశమిచ్చారు. జులై 24న సీట్లను కేటాయించి… జులై 23న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను విడుదల చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఇంజినీరింగ్ షెడ్యూల్(Engineering schedule) కూడా విడుదలైంది. జూన్ 27 నుండి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ, జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు, జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 19న రెండో విడత కౌన్సెలింగ్, జులై 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30న ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్, ఆగస్ట్ 5న తుది విడత సీట్లను కేటాయించనున్నారు.
Read Also: HYD : లక్డీకాపూల్ ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిని ఆసుపత్రి పాలైన గృహిణి