HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Security Ramped Up At Hyderabads Uppal Stadium

Uppal stadium: భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత!

ఈనెల 25న జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

  • Author : Balu J Date : 23-09-2022 - 10:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cp
Cp

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 25న జరగాల్సిన భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. టికెట్ల అమ్మకాల విషయంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని, స్టేడియం వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు 40 వేల మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. వీరిని కంట్రోల్ చేసేందుకు దాదాపు 2500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు.

అందుబాటులో రవాణా.. మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రేక్షకులు ఇళ్లకు వెళ్లేందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ని అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు అధికారులు. మ్యాచ్‌ జరిగే రోజు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా 300 సీసీటీవీ కెమెరాల ద్వారా స్టేడియం వద్ద పరిస్థితిని నిత్యం మానిటర్ చేస్తామన్నారు. గ్రౌండ్‌లో కూడా ప్రతి వ్యక్తిపై ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు.

మొబైల్స్ కి ఓకే, కెమెరాలు వద్దు.. గతంలో హైదరాబాద్ మ్యాచ్‌లకు సెల్ ఫోన్లకు అనుమతి లేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌లకు సెల్‌ఫోన్‌లు, బ్లూ టూత్ లు అనుమతిస్తున్నట్టు తెలిపారు పోలీసులు. కెమెరాలు మాత్రం తీసుకురావద్దని చెప్పారు. హెల్మెట్లకు కూడా నో పర్మిషన్. సిగరెట్లు, లైటర్లు, ఇతర మత్తు పానీయాలు కూడా లోపలికి తీసుకురాకూడదు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, తినుబండారాలు కూడా లోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. బ్యాగ్‌లు, ల్యాప్ టాప్‌లు కూడా ఇంటి వద్దే పెట్టి రావాల్సి ఉంటుంది. సహజంగా మ్యాచ్ అంటే జేబు దొంగలకు కూడా పని ఎక్కువగా ఉంటుంది. తోపులాటలో దొంగలు తమ పని కానిచ్చేస్తుంటారు. గతంలో పర్స్ లు, ఇప్పుడు మొబైళ్లు ఎక్కువగా దొంగలపాలవుతుంటాయి. ఈ క్రమంలో జేబు దొంగలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టామంటున్నారు పోలీసులు. స్టేడియం వద్ద ఏడు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • heavy security
  • hyderabad
  • hyderabad police
  • Uppal Stadium in Hyderabad

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Ms Dhoni Return To Csk Team

    Dhoni: CSK ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd