HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pm Narendra Modi Speech At Bc Atma Gourava Sabha

BC Atma Gourava Sabha : తెలంగాణ లో బిజెపి గెలిస్తే..బీసీ నేతే సీఎం – మోడీ

తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం... ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు

  • Author : Sudheer Date : 07-11-2023 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Bc Sabha
Modi Bc Sabha

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం (LB Stadium) లో బిజెపి తలపెట్టిన ‘బీసీ ఆత్మగౌరవ సభ’ (BC Atma Gourava Sabha) మోడీ మాట్లాడుతూ.. తెలంగాణ లో బిజెపి గెలిస్తే..బీసీ నేతే సీఎం అవుతాడని ప్రకటించారు. ఈ సభకు మోడీ (Modi) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు ముఖ్య అతిధులుగా హాజరు కాగా..సభ అంత బిజెపి , జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారింది.

ఈ సందర్బంగా మోడీ (Modi) మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని.. పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని గుర్తు చేసారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ బీసీని ఎందుకు సీఎం చేయడం లేదని మోడీ ప్రశ్నించారు.

తెలంగాణలో తొమ్మిదేళ్ళుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పాలన సాగుతోందని ప్రధాని ఆరోపించారు. నవంబర్ 30న ఈ విరోధి సర్కార్ ను విసిరి కొట్టాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ సర్కార్ దళిత, ఆదివాసీలకు ప్రియారిటీ ఇస్తోందన్నారు. రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేశామని.. గిరిజన బిడ్డను ఇప్పుడు రాష్ట్రపతిని చేశామని స్పష్టం చేసారు. ఓబీసీలకు ఏ పార్టీ ప్రియారిటీ ఇవ్వలేదని , కేంద్ర కేబినెట్ లో 27 మంది ఓబీసీలున్నారని అన్నారు ప్రధాని. డెంటల్ కాలేజీల్లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు ఆ రెండు పార్టీల లక్షణాలు అని విమర్శించారు. కాంగ్రెస్… బీఆర్ఎస్ సీ టీమ్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీయే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు.

బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్నారు. ఆ పార్టీ నేతలకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో అవినీతిని అంతం చేస్తాం… ఇది మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. లిక్కర్ స్కాం కేసును దర్యాఫ్తు చేస్తుంటే ఇక్కడి నేతలు సీబీఐ, ఈడీని తిడుతున్నారన్నారు. అవినీతి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారి నుంచి తిరిగి రాబడతామన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ బీఆర్ఎస్ వైఫల్యం అన్నారు. అన్ని నియామక పరీక్షలలో అవకతవకలు ఇక్కడ కామన్ అయ్యాయన్నారు. తెలంగాణకు మోసం చేసిన బీఆర్ఎస్‌ను సాగనంపాలని పిలుపునిచ్చారు.

Read Also : Goshamahal BRS Candidate : గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Atma Gourava Sabha
  • hyderabad
  • lb stadium
  • modi
  • Modi Speech
  • Telangana Polls

Related News

World Ivf Day

IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనడానికి గాంధీ ఆస్పత్రి మరోసారి నిదర్శనంగా నిలిచింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్‌లో ఉచితంగా చికిత్స పొందిన భువనగిరి జిల్లాకు చెందిన ఓ మ‌హిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. రవి, సౌమ్య దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వివాహమైనప్పటి నుంచి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Ntr Statue Ammerpet

    NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd