BRS Silver Jubilee Celebration : వాటిని బయటకు తీస్తూ బిఆర్ఎస్ భారీ స్కెచ్
BRS Silver Jubilee Celebration : గులాబీ అంబాసిడర్ కార్ల ర్యాలీ పార్టీకి చిహ్నంగా మారిన ఆ కారు పునరుత్థానంగా నిలుస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం
- By Sudheer Published Date - 04:11 PM, Fri - 25 April 25

తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా జరుపుకోబోతుంది. ఈ నెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తి వేదికగా సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ (BRS Silver Jubilee Celebration) కు రంగం సిద్ధమైంది. ఈ వేడుకతో ప్రజల్లో జోష్ నింపాలనే ఉద్దేశంతో పార్టీ నేతలు గ్రామాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ఎడ్లబండ్లతో ర్యాలీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు.
Gavaskar : ఇండియాలో ఇంచు భూమిని కూడా కదిలించలేరు – పాక్ కు గావస్కర్ వార్నింగ్
ఇక ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది 100 అంబాసిడర్ కార్ల గులాబీ ర్యాలీ. పార్టీ సింబల్ అయినా కార్ ను బయటకు తీస్తూ మరింత అకరించబోతున్నారు, ఈ కార్లను సేకరించి, రిపేర్ చేసి, గులాబీ రంగుతో అలంకరించి ర్యాలీగా తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రవి యాదవ్ అనే యువ నాయకుడు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ ర్యాలీ ద్వారా పార్టీకి ప్రజల మద్దతు ఎంతగా ఉందో చూపించాలన్నదే లక్ష్యంగా ఉంది.
సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాత కూడా ఈ కార్లను ప్రతి నియోజకవర్గానికి ఒకటిగా పంపించాలని భావిస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పునఃస్థాపనకు మార్గం వేయాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఈ వినూత్న ఆలోచనపై ఉత్సాహంగా స్పందిస్తున్నాయి. గులాబీ అంబాసిడర్ కార్ల ర్యాలీ పార్టీకి చిహ్నంగా మారిన ఆ కారు పునరుత్థానంగా నిలుస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం.