HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Phone Tapping Case Kcr Ktr Should Go To Jail Konda Vishweshwar Reddy

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Author : Latha Suma Date : 27-06-2025 - 5:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone tapping case..KCR, KTR should go to jail: Konda Vishweshwar Reddy
Phone tapping case..KCR, KTR should go to jail: Konda Vishweshwar Reddy

Phone Tapping Case : తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం సిట్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఆయనను విచారించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం

నా ఫోన్‌ను గతంలో ఎన్నోసార్లు ట్యాప్ చేశారు. అప్పుడే నేను అధికారులకు ఫిర్యాదు చేశాను. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే నాపై తప్పుడు కేసులు బనాయించారని నాపై కుట్ర పన్నారని నాకు గట్టి అనుమానం ఉంది” అని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సుదీర్ఘ కుట్ర. దీనికి ఆజ్ఞలు ఎక్కడినుండొచ్చాయో, ఎవరెవరు ఇందులో భాగమయ్యారో మొత్తం వెలుగులోకి రావాలి అని అన్నారు.

ఈ ఘటనపై పార్లమెంటు వేదికపై కూడా ప్రశ్నిస్తానని స్పష్టం చేసిన విశ్వేశ్వర్ రెడ్డి, దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరమైతే కేంద్రం సహాయంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, తద్వారా ఈ వ్యవహారాన్ని సమగ్రంగా వెలుగులోకి తేవాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తమ హోదాలను దుర్వినియోగం చేసి, ప్రైవసీని భంగపరిచారు. వాళ్లను జైలుకు పంపకపోతే ప్రజలకు న్యాయం జరగదు” అని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పాత పాలనలో జరిగిన అక్రమాలపై విచారణలు వేగంగా సాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ దిశగా వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, రాజకీయ ప్రముఖుల పేర్లు ఈ కేసులో చర్చకు వస్తుండటంతో మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణలో హాజరవడం ఈ కేసులో కీలకంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, అధికార పార్టీ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొట్టుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజాలు ఏంటో విచారణలో తేలాల్సిందే. కానీ ఈ కేసు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారడం మాత్రం ఇప్పుడే స్పష్టమవుతోంది.

Read Also: TGEAPCET : టీజీఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Konda Vishweshwar Reddy
  • ktr
  • Phone Tapping Case
  • SIT Investigation
  • Telangana phone tapping case

Related News

Kcr Bday

KCR Birthday: కెసిఆర్ కు సీఎం రేవంత్ విషెష్ !! నా హీరో అంటూ కేటీఆర్ ట్వీట్ !

తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) 72వ పుట్టినరోజు వేడుకలు నేడు (ఫిబ్రవరి 17) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

    Latest News

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd