HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Phone Tapping Case Former Sib Osd Prabhakar Raos Passport Cancelled

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్‌పోర్టులు ర‌ద్దు!

పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్న‌ట్లు పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్న‌ట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Author : Gopi Date : 26-10-2024 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Tapping Case
Phone Tapping Case

Phone Tapping Case: అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌కు (Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (SIB) మాజీ OSD ప్రభాకర్‌రావు, మరో నిందితుడు అరువెల శ్రవణ్‌రావుల పాస్‌పోర్టులు రద్దయ్యాయి. ఈ కేసులో కీలకమైన వీరిరువురూ దర్యాప్తును ఎదుర్కోకుండా అమెరికాలో తలదాచుకుంటున్నారని, వీరి పాస్‌పోర్టులు రద్దు చేయాలని హైదరాబాద్‌ పోలీసులు గతంలోనే ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (RPO)కు నివేదిక పంపారు.

పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్న‌ట్లు పాస్‌పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్న‌ట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి పాస్ పోర్టులు రద్దు చేయాలని పాస్‌పోర్టు ఆఫీస్ కు సిటీ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ రావు పాస్ పోర్టును అధికారులు ర‌ద్దు చేశారు. నిందితుల పాస్ పోర్టు రద్దు నివేదికను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిటీ పోలీసులు పంపారు.

Also Read: Under Eye Mask : నల్లటి వలయాలను పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే అండర్ ఐ మాస్క్ ను ఇలా తయారు చేసుకోండి

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అమెరికా పోలీసులకు సమాచారం అందిన వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లను డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు పై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున దేశంలో ఏ ఎయిర్ పోర్టులో దిగిన హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వనున్నారు. ఇక‌పోతే గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో ప్ర‌భాక‌ర్ రావు, శ్ర‌వ‌ణ్ రావులు కీల‌క పాత్ర పోషించార‌ని అధికారులు భావిస్తున్నారు. వారిద్ద‌రిని అదుపులోకి తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క సూత్ర‌ధారులు ఎవ‌ర‌నేది బ‌య‌ట‌ప‌డ‌నుంది. మ‌రోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత‌లు సైతం స‌వాళ్లు విసురుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A Sravan Kumar
  • brs
  • CID
  • congress
  • Phone Tapping Case
  • State Intelligence Bureau
  • T Prabhakar Rao
  • telangana news

Related News

Balka Suman

BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేప

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Supreme Court

    Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Dk Shiva Kumar

    Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

  • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd