HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Petrol Pumps Shut Down In Hyderabad No Stock Boards Displayed

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. నో స్టాక్‌ బోర్డులు.

  • Author : Vamsi Chowdary Korata Date : 25-03-2026 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Panic Buying
Panic Buying

Petrol Bunks Shut Down  ఆయిల్ కంపెనీలు ముందుగా నగదు చెల్లిస్తేనే స్టాక్ అనే కొత్త నిబంధన తేవడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత అప్పులు తీర్చి, కొత్త స్టాక్‌కు ముందే డబ్బు కట్టలేక పలు బంకులు మూతపడ్డాయి. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద జనం బారులు తీరడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చెల్లింపు విధానాల మార్పు వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్యేనని ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా, చమురు లభ్యత లేకపోవడంతో చాలా దేశాల్లో వంట గ్యాస్‌తో పాటు ఇంధన కొరత ఏర్పడింది. ఇప్పుడు ఈ సెగ హైదరాబాద్ నగరాన్ని కూడా తాకింది. నగరంలో పెట్రోల్, డీజిల్‌ లభ్యతపై ఆందోళన నెలకొంది. జనం బంకుల ముందు బారులు తీరుతున్నారు. దానికి కారణం స్టాకు అయిపోయి కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు మూతపడటం. గత రెండు రోజులుగా నగరంలోని పలు చోట్ల పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి.

గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్‌ బంకులకు సరఫరా చేసేవి. స్టాక్ సేల్ అయ్యాక ఒకటి రెండు రోజుల తర్వాత బంకుల యజమానులు ఆయిల్ సంస్థలకు తిరిగి డబ్బులు చెల్లించేవారు. కానీ మూడు నాలుగు రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని ఆయిల్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నగరంలో పలు బంకులకు సరఫరా నిలిచిపోయింది. పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్తగా స్టాక్‌కు డబ్బులు ముందే చెల్లించాలని ఆయిల్ సంస్థలు చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్‌ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆయా బంకులు మూతపడుతున్నాయి.

కాగా, ఆయిల్ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురిచేస్తున్నాయని బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్తగా మార్పులు తీసుకురావటం సరైంది కాదని అంటున్నారు. ఆయిల్ కంపెనీలు, పెట్రోల్‌ బంకుల మధ్య ఏర్పడిన వివాదంతో హైదరాబాద్ నగరంలో పెట్రోలు బంకులు మూతపడుతున్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోందని బంకుల యజమానులు వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చేతులు దులుపుకుంటున్నారే తప్ప కావాల్సిన చర్యలు తీసుకోవటం లేదని విమర్శిస్తున్నారు.

కాగా, హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ కొరత లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. డిపోలలో తగినంత ఇంధనం ఉందని అంటున్నారు. ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురై తమ వాహనాలను ఫుల్ ట్యాంకులు చేసుకునేందుకు ఎగబడటం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల బంకు యజమానులకు తాత్కాలిక సమస్య ఏర్పడిందని చెబుతున్నారు. అంతే కానీ ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. సరఫరాలోనూ ఎలాంటి లోపం లేదని పౌర సరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • New Payment Rules
  • Petrol Bunks
  • petrol bunks full rash
  • petrol bunks rush
  • Petrol Bunks Shut Down
  • Petrol Crisis

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd