Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్
- Author : Sudheer
Date : 18-01-2024 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించింది. మహాలక్ష్మీ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని.. రాష్ట్ర మహిళలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుుంటున్నారు. ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, దూర ప్రయాణాలకు.. ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణానికి వినియోగిస్తున్నారు. దీంతో ప్రతీ ఆర్టీసీ బస్సు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు.. ఇలా అన్నీ చోట్లా ‘మహాలక్ష్మీ’లే దర్శనమిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు లో పిటిష దాఖలు అయ్యింది. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక గత ఏడాది డిసెంబరు 8న జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. ఇది వివక్షతో కూడిన నిర్ణయమని పేర్కొన్నారు. ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉచిత ప్రయాణంతో బస్సుల్లో మహిళలు పోటెత్తడంతో టికెట్ కొన్న పురుషులకు సీట్లు దొరకట్లేదని పిటిషన్ లో తెలిపాడు. ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని వ్యాజ్యంలో చేర్చారు.
Read Also : Pakistan: ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం..!